నెహ్రూ జూపార్క్‌ : సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి.. చెమటలు పట్టించాడుగా (వీడియో)

Nov 23, 2021, 10:16 PM IST

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో (nehru zoological park) ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. ఏకంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి (lion enclosure ) దూకేందుకు ప్రయత్నించాడు. ఎన్‌క్లోజర్ పైకి ఎక్కిన యువకుడు దూకేందుకు ట్రై చేశాడు. వెంటనే గమనించిన జూ సిబ్బంది .. అతనిని అడ్డుకున్నారు. యువకుడిని సాయి కుమార్‌గా గుర్తించారు. అతనిని జూ సిబ్బంది గమనించకుండా వుండి వుంటే ఖచ్చితంగా సింహానికి ఆహారమయ్యేవాడని సందర్శకులు అంటున్నారు. అతనిని అదుపులోకి తీసుకున్న జూ సిబ్బంది పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.