Jun 16, 2020, 10:46 AM IST
పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం సబ్బితం జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. గోదావరిఖని నుండి సబ్బితం జలపాతానికి 4గురు యువకులు విహారయాత్రకు వచ్చారు. సరదాగా గడుపుతూ సెల్ఫీ దిగే క్రమంలో నలుగురిలో ఒక యువకుడు కాలుజారి జలపాతంలో పడడంతో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని గోదావరిఖనికి చెందిన డిప్లొమా స్టూడెంట్ ఆవుల యశ్వంత్(22)గా గుర్తించారు.