Sep 9, 2019, 6:14 PM IST
గులాబీ ఓనర్లు అనే పదం టీఆర్ఎస్ లో ముఖ్యమైన పదంగా మారిపోయింది. ఈటల రాజేందర్ వాడిన ఆ పదాన్ని నాయిని నర్సింహా రెడ్డి అంది పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అదో అస్త్రంగా మారింది. కార్పోరేషన్ చైర్మెన్ పదవులతో నాయిని సంతృప్తి పడబోనని చెప్పారు. మిగతా నాయకులు అదే దారి పడుతారా వేచి చూడాల్సిందే.