Aug 10, 2022, 5:24 PM IST
బిహార్ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు... జేడియూ-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి జేడియూ-ఆర్జేడి ప్రభుత్వ ఏర్పాటుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇది బిహార్ లోనే కాదు యావత్ భారత రాజకీయాల్లో పాజిటివ్ మార్పుగా కవిత పేర్కొన్నారు. బిజెపి బ్యాక్ డోర్ పాలిటిక్స్ ను ముందుగానే పసిగట్టిన నితీష్ గట్టిగా కౌంటరిచ్చారని అన్నారు. సీఎం నితీష్ ను అభినందిస్తున్నానని కవిత అన్నారు. ప్రపంచానికి బిహార్ లోని నలంద వంటి ప్రాంతాలు మార్గం చూపించాయని... ఇప్పుడు మరోసారి రాజకీయంగా మార్గం చూపారన్నారు. ఎవరు ఎవరిని మోసం చేసారో తేలీదు... అది వారి ఇంటి విషయం... కానీ బిహార్ ప్రజలు నితీష్ ను సీఎం చేసారు... ఆయనే సీఎంగా కొనసాగాలని కవిత పేర్కొన్నారు.