Jun 3, 2020, 10:47 AM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టిన రోజు వేడుకలు రాజ్ భవన్ లో నిరాడంభరంగా జరిగాయి. గవర్నర్ భర్త ఆమెకు స్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. సీఎం కేసీఆర్ పుష్ఫగుచ్చం ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష నాయకులు గౌరవపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్ లోని పోచమ్మ గుడిలో పూజలు చేసిన గవర్నర్, మొక్కలు నాటారు.