May 31, 2021, 4:30 PM IST
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించి కోవిడ్ ప్రొటొకాల్స్ ని ఎలా పాటిస్తున్నారా స్వయంగా పర్యవేక్షించారు. ఖైరతాబాద్ స్టేడియం నుంచి అమీర్పేట్ స్టేషన్ వరకు ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వాకబు చేసారు. స్టేషన్లు, రైళ్లలో తీసుకుంటున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు