Feb 6, 2023, 9:45 AM IST
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి బయలుదేరారు. ఇంటినుండి నేరుగా జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన మంత్రి ప్రత్యేక పూజలు చేసారు. స్వామివారి దర్శనం అనంతరం హరీష్ రావుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అధికారులు. అర్చకులు వేదాశీర్వచనం అందించారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం మంత్రి హరీష్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసెంబ్లీకి బయలుదేరారు.
ఈ సందర్భంగా బడ్జెట్ గురించి హరీష్ మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల ఆకాంక్షు, సీఎం కేసీఆర్ ఆలోనలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానకి ఒక్క రూపాయి ఇవ్వకున్నా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని... దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందని హరీష్ అన్నారు.