vuukle one pixel image

జగిత్యాలలో వ్యక్తి అనుమానస్పద మృతి...ఇద్దరు కూతుర్లు అదృశ్యం...

Chaitanya Kiran  | Published: Feb 4, 2023, 11:49 AM IST

జగిత్యాల జిల్లా :  జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావి దగ్గర జలపతి రెడ్డి(40) అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జగిత్యాలలో శుభాకార్యనికి ఇద్దరు కూతుర్లతో కలిసి జలపతి రెడ్డి వెళ్లాడు. కాగా అతను విగతజీవిగా కనిపించాడు. ఇద్దరు కూతుర్ల ఆచూకీ లభించలేదు. ఉదయం పొలానికి వెళ్లిన  జలపతి రెడ్డి సోదరుడు బావి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన  తమ్ముడి మృతదేహాన్ని గమనించి పోలీస్ లకు సమాచారం అందించాడు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.