Sep 6, 2019, 1:31 PM IST
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాద్వారాలకు బిగించనున్న తలుపులు గురువారం యాదాద్రికి చేరుకున్నాయి. దాదాపు రూ.మూడు కోట్ల వ్య యంతో సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేయించారు.. సప్తతల రాజగోపురానికి సంబంధించిన తలుపులను 24X14 అడు గుల సైజులో, మిగతా ఆరు గోపురాలకు 16X 9 అడుగుల సైజులో తయారుచేశారు.
న్యూబోయిన్‌పల్లిలో శ్రీతిరు కవాట మహోత్సవం నిర్వహించి, మేళతాలా లు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ యాదాద్రికి తరలించారు. న్యూబోయిన్‌పల్లిలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఊరేగింపును ప్రారంభించగా.. యాదాద్రిలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేలసంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఈవో గీత, వైటీడీఏ డైరెక్టర్ కిషన్‌రావు, అనురాధ టిం బర్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు, శరత్‌బాబు, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.