Galam Venkata Rao | Published: Mar 3, 2025, 2:00 PM IST
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం కూలిన ఘటనలో 8 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలు 10 రోజులుగా నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగం లోపల భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ బలగాలు సహాయక చర్యల్లో వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నాయి.