Aug 18, 2022, 5:05 PM IST
హైదరాబాద్ : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని మంత్రి అధికారిక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్దార్ పాపన్న సేవలు స్మరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి,తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.