Apr 21, 2020, 1:11 PM IST
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో కరోనా కేసు నమోదయ్యింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పెంటారెడ్డి కాలనీలో సత్యనారాయణ అనే బియ్యం వ్యాపారికి కరోనా అని తేలింది. విషయం తెలిసిన మునిసిపల్ సిబ్బంది అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పెంటారెడ్డి కాలనీలో పోలీసుల పహారా పెంచారు. కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రజలను మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం చేశారు.మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమీషనర్ శంకర్ మాజి జడ్పిటిసి మంద సంజీవరెడ్డి, కార్పోరేటర్లు, పోలిసులు మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.