Mar 3, 2022, 10:04 AM IST
నిర్మల్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. రెండు రోజుల ఉమ్మడి అదిలాబాద్ పర్యటనను అమ్మవారి దర్శనంతో ప్రారంభించారు మంత్రులు. అమ్మవారి దర్శనంకోసం వచ్చిన మంత్రులకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసా దాలను అందజేసి, ఆశీర్వదించారు. మంత్రుల వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు ఉన్నారు.