Sep 4, 2019, 3:02 PM IST
హైద్రాబాద్ లో సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.అన్ని ఆసుపత్రుల్లో సాయంత్రం వరకు ఓపీ సేవలను అందిస్తామని మంత్రి చెప్పారు. జ్వరం రాగానే డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ అనుకొంటున్నారన్నారు.కానీ, ఆగష్టు మాసంలో కేవలం 62 మందికి మాత్రమే డెంగ్యూ నిర్ధారని అయిందన్నారు. వీరందరికి కూడ డెంగ్యూ నయమైనట్టుగా కూడ ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుందని ఆయన చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు.