ఈటెల రాజేందర్ ను పీకేయడానికే.. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి వివాదాస్పదవ్యాఖ్యలు

Jun 13, 2020, 5:35 PM IST

కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌లో చేపట్టిన టీయూడబ్ల్యూజే ఉపవాస దీక్షకు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. వచ్చేవారం ఈటెలను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నారు.. అందుకే కేసీఆర్ ఈ పరిస్థితిని కల్పిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 3.5 లక్షల రూపాయలు కరోనా పేషంట్స్ కి ఖర్చు పెడుతున్నా అని చెప్తున్న ప్రభుత్వం మృతి చెందిన మనోజ్ కి ఎంత ఖర్చు పెట్టారో.. చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సహాయ నిధికి రేవంత్ రెడ్డి 2లక్షల రూపాయలు చెక్ ను అందజేశారు. ఐజేయూ అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి విరహత్‌ అలీ మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉపవాసదీక్షలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.