Apr 22, 2022, 4:53 PM IST
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వేసవిలో ఎక్కడ కూడా మంచి నీటి సమస్య రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులు, గ్రామాల సర్పంచులకు గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. హైదరాబాద్ లోని మిషన్ భగీరథ కార్యాలయం నుండి అధికారులు, సర్పంచ్ లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.మంచి నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తపడాలని సూచించారు. సరిపడా నీటి నిల్వలు ఉంచుకోవాలని... పంపుల నిర్వహణ, లికేజీలు లేకుండా చూసుకోవాలని... సమస్యలు ఉత్పన్నం అయితే ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలన్నారు.ప్రజలకు నూటికి నూరు శాతం మంచినీటిని అందించి సీఎం కెసిఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి అదేశించారు.