Video : హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు...నిర్మల్ కోర్టులో అక్బరుద్దీన్ ఒవైసీ

Dec 10, 2019, 5:01 PM IST

2012లో నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో వివాదాస్పద వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం నిర్మల్ కోర్టుకు హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో డిసెంబర్ 22, 2012లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన సభలో హిందూ దేవుళ్లు, దేవతల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.