సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగానే యువకుడి ఆత్మహత్యాయత్నం...పెద్దపల్లి సభలో కలకలం

సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగానే యువకుడి ఆత్మహత్యాయత్నం...పెద్దపల్లి సభలో కలకలం

Published : Aug 30, 2022, 11:48 AM ISTUpdated : Aug 30, 2022, 12:35 PM IST

పెద్దపల్లి : అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

పెద్దపల్లి : అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో వెంటతెచ్చుకున్న కిరోసిన్ ను అందరూ చూస్తుండగానే ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడు నిప్పంటించుకోకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి చెందిన పెరుమాండ్ల రమేష్ బిఈడి పూర్తిచేసినా ఉద్యోగం రాకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల కళాకారుడైన అతడి తండ్రి మల్లయ్య మృతిచెందగా ఇది తట్టుకోలేక తల్లికి పక్షపాతం వచ్చింది. దీంతో తన కుటుంబం రోడ్డున పడిందని రమేష్ వాపోయాడు. తనకు సీఎం సహాయనిధి కింద ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రభుత్వం తరపున ఏదయినా చిన్న ఉద్యోగం కల్పించాలంటూ కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు రమేష్ ప్రయత్నించాడు. అయితే సీఎంను కలిసే అవకాశం రాకపోవడంతో సీఎం ప్రసంగ సమయంలో రమేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 

06:37Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
13:13ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR
11:33ఎన్టీఆర్ పెట్టిన భిక్షకేసీఆర్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | KCR | Asianet News Telugu
22:01ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
06:51ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils NTR Statue
03:15ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
07:40NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu
04:47ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ | Jr NTR Pays Emotional Tribute To NTR
03:28Advocate Allam Nagaraju : ఈ వీడియో చూడకపోతే ప్రమాదంలో పడొచ్చు| Asianet News Telugu
05:01పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు POCSO case explained Telugu | Asianet News Telugu