Galam Venkata Rao | Published: Mar 3, 2025, 3:00 PM IST
కేసీఆర్ పాలనలో రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలు, రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో ఎర్రటి ఎండల్లో కుండా నీళ్లు ఇచ్చామని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలనలో నీళ్ల కోసం ప్రజలు, రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.