May 14, 2022, 3:22 PM IST
నల్గొండ: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజవర్గ పర్యటన ప్రారంభమయ్యింది. ప్రత్యేక హెలికాప్టర్ లో కేటీఆర్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కూడా సుంకిశాలకు చేరుకున్నారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మిస్తున్న ఇన్ టెక్ వెల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.