Feb 13, 2020, 12:42 PM IST
మేడిగడ్డ వద్ద లక్ష్మి ఆనకట్టలో జలాలు గరిష్ఠ ఎత్తుకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. వచ్చే వర్షాకాలంలో ఎక్కువగా నీరు వచ్చే అవకాశం ఉన్నందున నీటి ఎత్తిపోత విషయమై మార్గనిర్దేశం చేస్తారు.