మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో సందడి నెలకొంది. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. వేములవాడలో శ్రీ రాజ రాజేశ్వరి ఆలయాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సందర్శించారు. స్వామి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.