
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానాలు అందజేశామని, కేసీఆర్ గారిని కలుసుకునే అవకాశం లేకపోవడంతో ఆయన నివాసానికి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు.