Drunk Drive Check: మద్యం మత్తులో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి | Asianet News Telugu

Published : Jan 02, 2026, 05:01 PM IST

వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ గొడవకు దిగాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించి సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడికి చేరుకునేలోపే సదరు వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.