డెంగ్యూ: హోమియో మందులు పంపిణీ చేసిన ఈటల (వీడియో)

Sep 4, 2019, 1:09 PM IST

డెంగ్యూ వ్యాధికి మందు లేదు.. నివారణ ఒక్కటే మార్గమని తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  చెప్పారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండేందుకు గాను బుధవారం నాడు రామాంతపూర్ హోమియోపతి కాలేజీలో మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి  ప్రారంభించారు. .జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో రక్త పరీక్షలతో పాటు, ఓపీలను కూడ నిర్వహిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు.