సింగరేణి విషాదం : జగన్ లాగా కేసీఆర్ ఎందుకు చేయడు.. వి. హనుమంతరావు

Jun 4, 2020, 5:47 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్-3 ఓ సి పి-1 ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు పరామర్శించారు. సింగరేణిలో నిపుణులతో చేయించాల్సిన పనులను ఎలాంటి నైపుణ్యంలేని కాంట్రాక్టు కార్మికులతో చేయిస్తూ ప్రమాదాలకు గురిచేస్తున్నారన్నారు. నలుగురు కాంట్రాక్టర్ కార్మికులు మృతి చెందితే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఏ ఒక్కరు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తే యాజమాన్యం 40 లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకుంది అన్నారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యంగా పనులు చేయిస్తూ ప్రమాదాలకు కారణం అవుతుందన్నారు.