కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Feb 25, 2021, 4:03 PM IST

జగిత్యాల: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ గురువారం కొండగట్టు అంజన్న స్వామి ని దర్శించుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ...కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు.  ఈ దేవస్థానాన్ని కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి  చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిధులు ఇచ్చి దేవస్థానలను అభివృద్ధి చేయడం దేశంలోనే మొదటిసారని... ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు.  త్వరలోనే హనుమాన్ చాలిసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కవిత ప్రకటించారు.