Sep 7, 2023, 1:35 PM IST
పెద్దపల్లి : గ్రామ సమస్యల గురించి ప్రశ్నించినందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరులు తనపై దాడి చేసినట్లు ఓ యువకుడు ఆరోపించాడు. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం పెద్దంపేటలో గ్రామసభ సాక్షిగా తనపై దాడి జరిగినట్లు బాధితుడు పల్లె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసాడు. గ్రామ సమస్యలను అధికారులకు చెబుతుంటే ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా తనపై దాడి చేసారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసాడు. తనను చంపుతానని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని... రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు బాధితుడు శ్రీనివాస్.