Jul 7, 2020, 1:20 PM IST
హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి చెందగా, మరో ముగ్గురు కానిస్టేబుల్లకి గాయాలయ్యాయి. పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ పై బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడంతో బొలెరో వాహనం పల్టీకొడుతూ వెళ్లింది. వీరిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.