Sep 10, 2019, 2:53 PM IST
వనపర్తి: రబీ సీజన్ కు వ్యవసాయానికి పుష్కలంగా నీరు ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి కానందున చెరువులు నింపుకొని ఆయకట్టుకు నీరందించనున్నట్టు ఆయన తెలిపారు.
వనపర్తి జిల్లాలోని పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ జీరోపాయింట్ నుండి 24వ కిలోమీటర్ వరకు మోటార్ సైకిల్ పై మంగళవారం నాడు ఆయన ప్రయాణించారు. కాలువ పనులను ఆయన పరిశీలించారు. అదృష్టవశాత్తు ఈ సారి కృష్ణమ్మ కరుణించి శ్రీశైలం నిండిందన్నారు. యాసంగి వేరుశనగకు సాగునీటికి ఇబ్బంది లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
నాలుగేళ్లు ఇలానే నోళ్లొస్తే భూగర్భజలాలకు ఢోకా లేదని ఆయనతేల్చి చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా ఇప్పటికే వలసలు ఆగిపోయాయన్నారు. వలస వెళ్లిన వాళ్లు కూడ గ్రామాలకు తిరిగి వస్తున్నారని ఆయన చెప్పారు.