Video news : భారతమార్కెట్లో నుండి తప్పుకోనున్న వోడాఫోన్

Nov 1, 2019, 12:05 PM IST

వోడాఫోన్ భారతమార్కెట్లో నుండి తట్టా బుట్టా సర్దుకోనుందా? ఇది ఇప్పుడు టెలికాం ప్రపంచంలో వినిపిస్తున్న మాట.

వోడాఫోన్ ఏ నిముషమైనా భారత మార్కెట్ ను వదిలిపోవడానికి రెడీగా ఉందన్న మాట ఇప్పుడు టెలికాం సర్కిల్స్ బాగా వినిపిస్తోంది. జాయింట్ వెంచర్ కంపెనీలో నిర్వహణ నష్టాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుందని వినిపిస్తోంది.

వొడాఫోన్ -ఐడియాకి రోజురోజుకూ కస్టమర్లు తగ్గిపోవడం ఒకటైతే, క్షీణిస్తున్న విఫణీ పెట్టుబడి వ్యవస్థ వల్ల కొత్తగా నిధుల సమీకరణ కుదరకపోవడం మరొకటి..ఈ సమస్యలే వొడాఫోన్ నిష్క్రమణకు కారణాలుగా మారుతున్నాయి.
 
మూడునెలల్లో 28వేల 309 కోట్ల రూపాయల AGR అమౌంట్ ను కట్టాలని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా దీనికి మరో కారణంగా కనిపిస్తుంది. 

ఈ తీర్పును అనుసరించి వొడాఫోన్-ఐడియా బుధవారంనాడు 52 వారాల తక్కువకు 3.66 రూపాయలదగ్గర మొదలై 3.86 రూపాయల దగ్గర ముగిసింది. అనేక బిలియన్ల డాలర్ల పెట్టుబడి ఉన్న వోడాఫోన్ విపణిలో 11వేల 91 కోట్లు మాత్రమే లభించింది. 

AGR తీర్పు మీద కంపెనీ మీడియాతో మాట్లాడింది. గౌరవనీయ సుప్రీంకోర్టు AGR కేసులో ఇచ్చిన జడ్జిమెంటుతో వొడాఫోన్-ఐడియా బాగా అసంతృప్తికి లోనయ్యిందన్నారు.