జియో సినిమా కోసం దక్షిణాదిన ఉదయించిన ‘సన్’

Dec 4, 2019, 12:26 PM IST

సన్ టివి నెట్‌వర్క్ నుండి ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సన్ నెక్స్ట్ సహకారంతో, జియో సినిమా, దేశవ్యాప్తంగా ఉన్న జియో వినియోగదారులకు అత్యుత్తమమైన దక్షిణ భారత చలన చిత్రాలను అందిస్తుంది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉన్న అన్ని సినిమాలను జియో సినిమా తన యూజర్లకు అందించనుంది.

సన్ నెక్స్ట్ యొక్క లైబ్రరీ నుండి 4,000 కి పైగా దక్షిణ భారత చలన చిత్రాలను జియో సినిమా అభిమానులు వీక్షించవచ్చు. దక్షిణ భారతీయ చలన చిత్ర అభిమానులు ఈ అదనపు వినోదాన్ని జియో సినిమా అందించే అత్యంత అత్యాధునికమైన మరియు ప్రపంచ స్థాయి వీడియో స్ట్రీమింగ్ అనుభవంలో అన్వేషించవచ్చు.
 
జియో వినియోగదారులకు జియో సినిమాలో ప్రత్యేకమైన యాక్సస్ ఉంటుంది. వారి అభిమాన తారలు మహేష్ బాబు, రజనీకాంత్, విజయ్, అల్లు అర్జున్, అజిత్ కుమార్, మమ్ముట్టి మరియు మరెంతో మందితో జియో సినిమా యొక్క “సూపర్ సౌత్ స్వాగ్” లో భాగం కావచ్చు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మోలీవుడ్ నుండి సౌత్ స్టార్స్ యొక్క జాబితాను మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆస్వాదించవచ్చు.
 
విస్తృత శ్రేణి మరియు బహుముఖ ఆన్-డిమాండ్ వీడియో అనుభవాలకు జియో సినిమా ప్రసిద్ది చెందింది. మరో వైపు దక్షిణ భారత స్టూడియోల నుండి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లకు
సన్ నెక్స్ట్ ప్రసిద్ధి.  దక్షిణ ప్రాంతం నుండి సరికొత్త మరియు అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ కంటెంట్‌ను సన్ నెక్స్ట్ అందిస్తుంది. ఈ రెండు డిజిటల్ ప్లాట్‌ ఫామ్ ల మధ్య తాజా అనుబంధం జియో దక్షిణాది  సినీ అభిమానులకు అత్యుత్తమ దక్షిణ భారత వీడియో కంటెంట్‌ను అందించడంలో సహాయపడుతుంది.
 
జియో సినిమా ఇప్పటికే 10,000+ సినిమాలు, 1 లక్ష + టీవీ షో ఎపిసోడ్లు  మరియు ఒరిజినల్స్ సహా విశాలమైన కంటెంట్‌ను కలిగి ఉంది. ఇప్పుడు, సన్ నెక్స్ట్ యొక్క మూవీ కేటలాగ్‌తో, అపరిమిత సౌత్ ఇండియన్ బ్లాక్ బస్టర్‌లను ఆస్వాదించడానికి వినియోగదారులకు జియో సినిమా మొదట గుర్తుకు వస్తుంది.