Video: రికార్డుల రారాజు : భారత జంబో క్రికెటర్ అనిల్ కుంబ్లే

Oct 17, 2019, 7:45 PM IST

భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు.

1. బెంగళూరు RVCE, కాలేజ్ నుండి కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశారు.

2. అనిల్ కుంబ్లేకున్న నిక్ నేమ్ జంబో. క్రికెట్ అభిమానులు చాలామంది ముద్దుగా అనిల్ కుంబ్లేను జంబో అని పిలుచుకుంటారు. ఎలాంటి పిచ్ మీదనైన అలవోకగా బౌలింగ్ చేయగలడం, ముఖ్యంగా బౌన్సింగ్ చేయడం ఆయన ప్రత్యేకత అందుకే ముద్దుగా జంబో అంటారు. అంతేకాదు అనిల్ కుంబ్లేది భారీ విగ్రహం కాబట్టి కూడా  తన టీమ్ మేట్స్ ముద్దుగా జంబో అని పిలుచుకునేవారు.

3. ఈ స్పిన్ మాస్టర్ తనువేసిన బాల్ ను తానే క్యాచ్ పట్టుకున్న సంఘటనలు కోకొల్లలు. ఈ విషయంలో శ్రీలంక స్పిన్ మాస్టర్ ముత్తయ్య మురళీధరన్ కి అనిల్ కుంబ్లేకు చాలా పోలికలు ఉంటాయి.

4. ఫాస్ట్ బౌలర్ గా తన కెరీర్ ప్రారంభించిన కుంబ్లే తరువాతి కాలంలో ఆల్ టైం గ్రేటెస్ట్ స్పిన్నర్ గా మారాడు. ప్రపంచంలోనే టెస్టు మ్యాచుల్లో 30 సార్లకు పైగా ఐదు వికెట్లు తీసుకున్న నలుగురు బౌలర్లలో కుంబ్లే ఒకడు.

5. కుంబ్లే సాధించిన రికార్డుల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. మచ్చుకు చరిత్రలో నిలిచిపోయిన ఓ రికార్డు గురించి చూద్దాం. 1998లో జింబాబ్వేతో జరిగిన వన్ డే మ్యాచ్ లో కుంబ్లే 200 వన్ డే వికెట్ తీసుకున్నాడు. అది అతన్ని వన్ డేల్లో 200వికెట్లు చేసిన మొట్టమొదటి స్పిన్నర్ గా రికార్డుల్లో కెక్కించింది. 

6. న్యూఢిల్లీ ఫిరోజ్ ఖాన్ కోట్ల స్టేడియంలో 1999, ఫిబ్రవరి ఏడున పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వరుసగా పదివికెట్లు తీసి పాకిస్తాన్ ను మోకాళ్లమీద వంగేలా చేసిన ఘనత కుంబ్లేది.