Galam Venkata Rao | Published: Apr 3, 2025, 7:00 PM IST
RCB vs GT IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టే ఇన్నింగ్స్ లను ఆడాడు. ఆర్సీబీ జట్టుకు చాలానే విజయాలు అందించాడు. అయితే, ఆ టీమ్ తనను వద్దనుకుంది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తనను వదులుకుంది. తనను వదులుకున్న ఆర్సీబీపై వారి సొంత గ్రౌండ్ లో సూపర్ బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు సిరాజ్ మియా. పెద్దగా పరుగులు ఇవ్వకుండా కీలకమైన 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బకొట్టి గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని అందించాడు.