Galam Venkata Rao | Published: Apr 12, 2025, 6:00 PM IST
Priyansh Arya: తన తొలి ఐపీఎల్ సీజన్ లోనే అదరిపోయే ఇన్నింగ్స్ లు ఆడుతున్న యంగ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య.. మరోసారి దుమ్మురేపే బ్యాటింగ్ తో దిగ్గజ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ముల్లన్ పూర్ లో పరుగుల సునామీ సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో 4వ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. దేశవాళీ క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సంచనల రేపిన ప్రియాంశ్ ఆర్య.. ఐపీఎల్ పంజాబ్ కింగ్ తరఫున ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ పై హ్యాట్రిక్ పోర్లు, సిక్సర్లతో మరోసారి తన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు.