KL Rhaul: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని ఎదుర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 24వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెజంర్స్ బెంగళూరు తలపడింది. బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొడుతూ ఆర్సీబీని డీసీ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్. ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్బుతమైన నాక్ తో చివరివరకు క్రీజులో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు.