India vs England: టీ20 సిరీస్‌లో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన భారత్.. వన్డే సిరీస్‌లోనూ అదరగొట్టింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కి చుక్కలు చూపించింది. తొలి వన్డే విక్టరీ జోరును కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో పాటు గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ రాణించడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో క్రికెట్ అభిమానులు పండగ చేసుకున్నారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ని టీమిండియా కైవసం చేసుకోవడం విశేషం.