India Creates History: Women's Kho Kho Team Wins 2025 World Cup భారత ఖోఖో మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆటతో అదరగొడుతూ ఖోఖో ప్రపంచ కప్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఒక్క ఓటమి లేకుండా భారత్ అద్భుత ప్రదర్శనతో తొలి ఖోఖో ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం (జనవరి 19)మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ తో తలపడింది. ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్ ఫైనల్ లో దుమ్మురేపే ప్రదర్శనతో నేపాల్ ను చిత్తు చేసింది.