ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాలను ప్రదర్శించాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు.ఇద్దరూ ప్రతిభ కలిగి ఆటగాళ్లని... అయితే, గత ప్రదర్శనలను చూస్తే ఆశించినంత పరుగులు చేయలేకపోయారని చెప్పారు. వారిపై అంచనాలు సహజమేనని.. విఫలమైనప్పుడు విమర్శలు సహజమని కామెంట్ చేశారు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ముందుకు ఉన్నందున వారి సామర్థ్యాలను ప్రదర్శించడానికి, భారత్ తరపున మ్యాచ్‌లను ఎలా గెలవగలరో నిరూపించడానికి గొప్ప అవకాశం ఉందన్నారు. ఇక్కడ వారు విజయం సాధించకపోతే యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు.