
న్యూఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్‌లో ప్రధాని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోన్సిగ్నర్ ఫాదర్ సహా చర్చ్ పెద్దలు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్బంగా శాంతి, ప్రేమ, సోదరభావం విలువలను ప్రధాని గుర్తు చేశారు. దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.