
ఇకపై రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు లగేజీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. విమానాశ్రయాల తరహాలోనే రైల్వేలో కూడా లగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. కోచ్‌ను బట్టి ఉచితంగా తీసుకెళ్లే లగేజీ పరిమితి నిర్ణయించబడింది. ఆ పరిమితిని మించి సామాను తీసుకువెళ్తే తప్పనిసరిగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పరిమితి మించి కోచ్‌లోకి తీసుకెళ్తే భారీ జరిమానా విధిస్తామని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.