
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక పెళ్లి ఇంట్లో జరిగిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వరుడు అవధేశ్ కుమార్ రాణా తన పెళ్లి రోజున సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారు. వధువు కుటుంబం సాంప్రదాయంగా 31 లక్షల రూపాయలను ప్లేట్‌లో తీసుకొచ్చారు. కట్నంగా ఇవ్వాలని భావించారు. అయితే, అవధేశ్ కట్నాన్ని తిరస్కరించాడు. కట్నం తీసుకోవడం తప్పని చెప్పాడు. 31 లక్షల్లో ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు. దహెజ్ ఆచారం పూర్తిగా ఆగాలని కోరుకున్నాడు.