Delhi Election Results : ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూరమైందని బీజేపీ ఎంపి మనోజ్ తివారీ అన్నారు. న్యూఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు. తొలి నుంచి బిజెపి ట్రెండ్స్‌లో చాలా ముందుందన్నారు. బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కి దూరమయ్యారని.. ఇదే ఓటింగ్ ట్రెండ్‌లో కనిపించిందన్నారు. ఆప్ అవినీతే, వైఫల్యాలే ప్రజల మద్దతును కోల్పోవడానికి కారణాలుగా చెప్పారు.