
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సౌత్ వెస్ట్రన్ కమాండ్ పరిధిలో ఉన్న ప్రేరణ స్థల్ వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వీస్ డే వేడుకల్లో పాల్గొని, భారత సైన్యం చేసిన త్యాగాలు, సేవలను స్మరించారు.