Jun 4, 2023, 3:39 PM IST
నేటి రోజుల్లో వయసుతో తేడా లేకుండా ప్రతొక్కరు చెప్పే మాట.. కీళ్ల నొప్పి, వెన్నునొప్పి. అంతేకాదు చిన్న దెబ్బకే ఎముకలు విరిగిపోవడం చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. వీటికి కారణం ఏంటీ అంటే జీవన విధానం. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం. ఇవన్నీ ఎముకల దృఢత్వాన్ని తగ్గించి తొందరగా వీక్ అయ్యేలా చేస్తున్నాయి. జంక్ ఫుడ్స్, ఆహారంలో ఓ క్రమపద్ధతిని పాటించకపోవడం ఎముకలు బలహీనం కావడానికి కారణాలు. అయితే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని.. వాటికి క్రమపద్ధతిలో పాటిస్తే ఎముకల దృఢత్వానికి బాగా పనిచేస్తాయి. అలా ఎముకల దృఢత్వానికి తోడ్పడే ఆహారపదార్థాలేంటో చూడండి.