May 22, 2021, 4:44 PM IST
ఏదైనా మంచి పని.. లేదా శుభకార్యానికి వెళ్లేటప్పుడు.. పెరుగులో పంచదార కలుపుకొని తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనిని చాలా సంవత్సరాలుగా అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే.. అలా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలీదు కానీ.. పరగడుపున తింటే మాత్రం చాలా లాభాలున్నాయట.