Mar 30, 2020, 4:54 PM IST
కరోనావైరస్ మాకు రాదు అని ఎవ్వరూ అనుకోవడానికి లేదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కరోనా జాగ్రత్తలమీద రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనావైరస్ వల్ల ప్రపంచదేశాలు ఎలా వణికిపోతున్నాయో తెలిపారు. మనదేశంలో కరోనా కట్టడికోసం ప్రధాని నరేంద్రమోడీ అనేక చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరోనా కట్టడి చేయాలంటే బాధ్యతాయుతమైన పౌరులుగా వాటిని తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.