
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి చేరుకున్న వాహనాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్‌కు పంపించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం, ప్రజల గొంతుకగా నిలిచే ఈ కోటి సంతకాల ఉద్యమం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల ఆశయాలను ప్రతిబింబించే ఈ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ పోరాటానికి ప్రతీకగా నిలిచింది.