Galam Venkata Rao | Published: Feb 12, 2025, 10:00 PM IST
Kiran Royal Controversy: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాట తీస్తానని అన్నారని... తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ తాట ఎప్పుడు తీస్తారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. జనసేన నేత కిరణ్ రాయల్ వల్ల లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగిందని.. తిరిగి ఆమెపైనే కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు.