సాల్మన్ హత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నేతలు డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.